Ultimate magazine theme for WordPress.

సీనియర్ జర్నలిస్ట్ వాకిటి మధుకు గౌరవడాక్టరేట్ ప్రధానం

Post top
home side top

@జర్నలిజం ,కమ్యూనికేషన్ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వాకిటి మధుకు డాక్టరేట్ బిరుదు ప్రధానం….

@మిర్యాలగూడ జర్నలిజం చరిత్రలో నూతన అధ్యాయం…….,…………………………..మిర్యాలగూడ ప్రజాలహరి…..వాకిటి మధు కు గౌరవ డాక్టరేట్ ప్రదానం. * అమెరికా ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీ ( న్యూయార్క్ ) వారు మీడియా, కమ్యూనికేషన్ రంగాలలో కృషి చేసిన జర్నలిస్ట్, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ పూర్వ ప్రజా సంబంధాల అధికారి వాకిటి మధు కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్ లో జరిగిన యూనివర్శిటీ కార్యక్రమం లో వివిధ రంగాలలో నిష్ణాతులైన 10 మందికి గౌరవ డాక్టరేట్ లను, 35 మందికి “భారత్ కే అన్మోల్” అవార్డులను తెలంగాణా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధులుగా మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్, యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. *. వాకిటి మధు గతంలో జర్నలిస్ట్ గా, ఆకాశవాణిలో సహాయ కార్యక్రమాల నిర్వాహకుడిగా, హైదరాబాద్ దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యునిగా, ఎఫ్ డీ సి లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. గతంలో ప్రజా సంబంధాలపై రెండు పుస్తకాలను, భారతీయ సినిమా పై ఒక పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా, భారత ప్రజా సంబంధాల సొసైటీ జాతీయ సభ్యునిగా పనిచేస్తున్నారు.  మిర్యాలగూడ తో మాతృ బంధ సంబంధం… మిర్యాలగూడ పట్టణానికి మధుకు విడదయరాని బంధం అదే మాతృబంధ సంబంధం మిర్యాలగూడ పుట్టి పెరిగిన మధు విద్యాభ్యాసం మిర్యాలగూడ లోనే జరిగింది. విద్యాభ్యాసం అనంతరం మిర్యాలగూడ ఈనాడు రిపోర్టర్ గా తొలిఅడుగులు వేశారు. జర్నలిజంపై మక్కువ జర్నలిజం రంగంలో ఉన్నత ప్రమాణాలు ,సమాజం పట్ల బాధ్యతతో పనిచేస్తూ అంచలంచెలుగా ఎదిగారు. సమాచార అండ్ ఫిలిం కార్పొరేషన్ సంస్థలో ఉద్యోగిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు. మృదు స్వభావి , సూక్ష్మ గ్రహి చక్కని  తేట తెలుగు రచనలు స్క్రిప్టుల తొ ఉన్నతాధికారుల మెప్పుని పొందారు . వాకిటి మధు చేబ్రాలు కంప్యూటర్ అక్షరాలు వలె చక్కగా ఉంటాయి ఆయన జర్నలిస్టుగా ఒక స్క్రిప్ తయారు చేస్తే ఆ స్క్రిప్ట్ ఎవరు ఎవరు వేలెత్తి చూపేవారు కాదు.. వృత్తిలో నిబద్ధత తో అంచలంచెలుగా ఎదుగుతూ ఫిలిం కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో మేనేజర్ గా పదోన్నతులు పొందారు. సమాచార శాఖలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల  ఎంట్రోస్ స్క్రిప్టులు ఈయన చేతిమించే ఎక్కువ శాతం జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవాలు ,  నాటక నంది ఉత్సవాలను నిర్వహించడంలో ఆయనకు ఆయననే సాటి. ప్రభుత్వం అప్పజెప్పి ఏ బాధ్యతమైన చక్కగా వ్యవహారికంగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేవారు. భారత ప్రధాని, విదేశీ ప్రధానులు హైదరాబాదు వచ్చిన సందర్భాల్లో వారి యొక్క ప్రోగ్రాం, రిసీవింగ్ ప్రోగ్రామ్స్ తయారు చేయడంలో అందవేసిన చేయి. అదే ఆయన విజయాలకు మెట్లుగా నిలిచాయి . పదవీ విరమణ చేసిన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రజా సంబంధ పౌర సమ్మేళనాల్లో మీరు పాత్ర అమోఘంగా ఉండేది. ఇటీవల కాలంలో అమెరికా ఇతర దేశాల్లో కూడా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ సమ్మేళనాల్లో పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.