Ultimate magazine theme for WordPress.

ఘనంగా రాహుల్ గాంధీ జయంతి వేడుకలు

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి..  రాహుల్ గాంధీ గారి జన్మదినం ను పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక ఏరియా హాస్పిటల్ లో పేషెంట్స్ కు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మరియు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎవరు కూడా బర్త్డే కేక్స్ కట్ చేయవద్దని మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పేదలకు అండగా ఉంటాం అనే భరోసాని ఇస్తూ వారికి సహాయ సహకారాలు అందించే దిశగా అడుగులు వేయాలని రాహుల్ గాంధీ పిలుపుమేరకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ కు మరియు వారి సహాయకులకు పాలు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశామని రాహుల్ గాంధీ గారిని మేమందరము ఆదర్శంగా తీసుకుంటామని వారు ప్రతిక్షణం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే నాయకుడని వారికి వారు అకుంఠిత దీక్షతో పాదయాత్రలు చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట నిలబెట్టారని మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నైతిక విజయం మాదేనని మన ప్రధాని మోడీ గారు కుల మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కున్నాడని వారు 400 సీట్లకు పైగా వస్తాయని ఎన్ని ప్రగల్బాలు పలికినప్పటికీ వారి మాయమాటలు నమ్మకుండా ప్రజలు వారికి సరైన మెజార్టీ ఇవ్వలేదని విషయం మనందరికీ తెలిసిందేనని ఇప్పటికి కూడా వారు మోసపూరిత మాటలతోనే కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రధానమంత్రి కాగలిగారని కానీ నైతిక గెలుపు మాత్రం మా కాంగ్రెస్ పార్టీ దేనని అయినప్పటికీ మేము చెక్కుచెదరని ధైర్యంతో ముందుకు వెళ్తామని ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం అనునిత్యం పాటుపడతామని మా రాహుల్ గాంధీ గారు ఇచ్చే ప్రతి పిలుపును మేము శిరసావహిస్తూ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల లాగా పనిచేస్తామన్నారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ముదిరెడ్డి నర్సిరెడ్డి,గంధం రామకృష్ణ, జలంధర్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్, సికిందర్, పలువురు శీను అబ్దుల్లా విష్ణు, అనిల్, చక్రి, ఇరుగు మధు, అవుట శీను, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.