Ultimate magazine theme for WordPress.

నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు ఎస్పి

Post top

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

 

* **నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై చీటింగ్ కేసులు నమోదు..జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్*

* *జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెంబర్ ప్లేట్ లేని 1769 వాహనాలు పట్టుబడి..*

 

నేర నియంత్రనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారం రోజులలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే 1769 వాహనాలను పట్టుబడి చేయబడినాయని జిల్లా ఎస్పి గారు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో నేరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడే నేరస్తులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను ఉపయోగిస్తున్నారని, నేరాల నియంత్రణ,చేధన కొరకు ఈ విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటి నుండి జిల్లాలో నెంబర్ ప్లేట్లు లేకుండా గానీ,నెంబర్ ప్లేట్లు టాంపర్ చేసి గానీ ఎవరైనా పట్టుబడితే వారిపై చీటింగ్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు వారు చేపడుతున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.