Ultimate magazine theme for WordPress.

ప్రభుత్వ హాస్టల్స్ లో బలవర్ధకమైన భోజనాన్ని గాని అల్పాహారన్ని అందించకపోతే నాకు ఫోన్ చేయండి …ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

*మిర్యాలగూడలో గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన MLA

మిర్యాలగూడ ప్రజాలహరి..

విద్యార్థులకు బలవర్ధకమైన పదార్థాలతో కూడిన అల్పాహారం అందిస్తేనే లాభమని ఆ పదార్థాలు లేకుండా అల్పాహారం అందించటం వల్ల ఏమి ప్రయోజనం హాస్టల్ అధికారులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మందలించారు

 మంగళవారంమిర్యాలగూడ పట్టణంలోని *తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల ను ఎంఈఓ బాలాజీ నాయక్ తో కలసి ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి    హాస్టల్ లోని ఉదయం అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు… ప్రతిరోజూ ఉదయం పెట్టే అల్పాహారం లిస్ట్ మరియు ఈరోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్ట్ వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు .. అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.. హాస్టల్ లో టాయిలెట్స్ శుభ్రంగా లేవు ఇలా ఉండటం మూలాన దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి వెంటనే వాటిని శుభ్రపరచి ప్రతిరోజూ సానిటైజేషన్ చేయాలి అని హెచ్చరించారు… అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయం ప్రేర్ లో పాల్గొని సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.. నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదు.. నేను అప్పుడైనా, ఇప్పుడైన, ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమే.. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు…

post bottom

Leave A Reply

Your email address will not be published.