Ultimate magazine theme for WordPress.

రుణమాఫీ జీవోను సవరించాలి.. జూలకంటి రంగారెడ్డి

Post top
home side top

*రైతుల రుణమాఫీ కొరకు జీఓ ను సవరించి రైతులకు వెంటనే న్యాయం చేయాలి*

 

IIమాజీ శాసనసభ్యులు & ఆల్ ఇండియా కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్II

 

మిర్యాలగూడ 16జులై, ప్రజాలహరిp

 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతులకు రుణమాఫీ జీఓ నెంబర్ 667 ను వెంటనే సవరించి రైతులకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ జాతీయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రుణమాఫీకి రూపొందించిన నిబంధనలలో గల అంశాలను సవరించి 2 లక్షల వరకు రుణం పొందిన రైతులకు లబ్ది చేకూరేటట్లు సవరించాలని కోరారు.ప్రభుత్వ జీఓ ప్రకారం రేషన్ కార్డును ఆధారంగా చేయకుండా వారందరికీ ఒకే కుటుంబంగా పరిగణించి, కుటుంబంలో ఒకే వ్యక్తికి రుణమాఫీ వర్తింపు చేస్తే కుటుంబంతో విడిపోయిన వారికి రుణమాఫీ వర్తించదన్నారు. ఆధార్ కార్డు పాస్బుక్ డేటా పిడిఎస్ స్టేషన్ డేటా ఒకటిగా ఉన్నవారికి వర్తింప చేస్తామన్నడం సరికాదన్నారు. ఆధార్ కార్డు లేని వారు పాస్ బుక్ రేషన్ కార్డు లేని కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని పాస్ పుస్తకాల కొరకు ధరణిలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ప్రజా పాలన సర్వేలో తేలిందన్నారు. అలాగే రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుత జీవో ప్రకారం ఆధార్ కార్డు,పాస్ బుక్, రేషన్ కార్డు ఉన్న వారికే వర్తింప చేస్తామని చెప్తున్నారని తెలిపారు. వ్యవసాయం కొరకు రుణం తీసుకున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్, రైతు మిత్ర గ్రూప్, కౌలుదారులకు ఇచ్చిన లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఉన్నవారికి రుణమాఫీ వర్తించదని ప్రకటించడం సరికాదన్నారు. వాస్తవానికి ఈ నాలుగు గ్రూపుల్లోని వారు అత్యంత పేద కుటుంబాలకు చెందిన దళిత గిరిజన వెనుకబడిన వర్గాలలో ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలకు కూడా రుణమాఫీ వర్తించదని నిబంధన పెట్టడం వల్ల గతంలో కరువులు వరదల వల్ల నష్టపోయిన రైతులకు బ్యాంకులు రుణాలు మూడు నుంచి ఐదు సంవత్సరాలు వాయిదాలపై షెడ్యూల్ చేశారని వీరికి రుణమాఫీ వర్తించకపోవడంతో అన్యాయం జరుగుతుందన్నారు రెండు లక్షలకు మంచి రుణం పొందిన వారు రెండు లక్షలకు పైగా ఉన్న అప్పు చెల్లిస్తేనే మాకు వర్తిస్తుందని నిబంధనలు పెట్టడం వల్ల చాలా మందికి అన్యాయ జరుగుతుందన్నారు.

 

గత పది సంవత్సరాలుగా రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం తీసుకున్న రుణానికి వడ్డీఅధికంగా పెరిగిందని తెలియజేశారు. అనేకమంది రైతులు రెండు లక్షల రూపాయల బాకీలుగా ఉన్నప్పటికీ గతంలో ప్రకటించిన 2014 నుండి 2018 వరకు రుణమాఫీ పథకాలు వారికి వర్తించలేదన్నారు,అట్టివారికి రుణం 2 లక్షలకు పైగా ఉందని వారు అప్పు చెల్లించగలిగిన స్థితిలో లేరన్నారు. ప్రస్తుతం వానాకాలం పంటలు వేయడం ప్రారంభించడంతో రైతులు పెట్టుబడికి అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. జూన్ సెప్టెంబర్ మధ్య రెండు లక్షలకు పైగా ఉన్న అప్పులు చెల్లించడం సాధ్యం కాదని చెప్పారు పీఎం కిసాన్ డేటాకు రుణమాఫీని జోడించడం వలన చాలామంది రైతులు రుణమాఫీ అర్హత కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ బ్యాంకులు 43 లక్షల మందికి మాత్రమే అప్పులు ఇస్తున్నారని మిగిలిన 31 లక్షల మందికి కూడా వర్తింపజేయాలని కోరారు, అందువలన పీఎం కిసాన్ డేటాను వర్తింప చేయడం వలన ఆసత కలిగిన వారు రుణమాఫీ పొందలేక పోతారని చెప్పారు. గతం నుండి బ్యాంకులు బుక్ అసైన్ మెంట్ ద్వారా రైతులకు రుణాలు పెంచుకుంటూ వస్తున్నాయని తెలిపారు అందువల్ల 9 -12 -2023 తర్వాత రీ షెడ్యూల్ చేసినా రుణాలకు లేదా బుక్ సర్దుబాటు చేసినా రుణాలకు రుణమాఫీని తక్షణమే వర్తింపజేయాలని జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు అనుగుణంగా రైతుల జీవన ప్రమాణాల ఆధారంగా సవరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.