Ultimate magazine theme for WordPress.

కార్మిక కర్షక, పేద వర్గాల తొ మమేకమవుతున్న… ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

పాలనపై పట్టు కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి…

నిరంతర సమావేశాలు నిరంతర తనిఖీలతో బిజీ బిజీ. కార్మిక , పేద వర్గాలతో మమేకమవుతున్న బిఎల్ఆర్

(మిర్యాలగూడ) ప్రజాలహరి… 8 ఏళ్లుగా ప్రజాసేవలో సామాజిక సేవలో తరించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రజాప్రతినిధిగా తొలిసారి కౌన్సిలర్ గా, మరుసటి సారి (తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు )అనగా మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కౌన్సిలర్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలు పెరిగాయి. దీంతో ఆయన శాకాలవారిగా సమీక్షించుకుంటూ స్వయం నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ముందుగా ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రికి మార్చాలనే సంకల్పంతో మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా స్థాయి హాస్పిటల్ కలిగిన దాన్ని ఇప్పటికీ ఒక ఎనిమిది సార్లు విసిట్ చేశారు విసిట్ చేయడమే కాకుండా అక్కడ ఉండే రోగులతో బంధువులతో మాట్లాడారు అంతేకాక ఆసుపత్రి వైద్య అధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని రెగ్యులర్గా అనుభవం కలిగిన వైద్యుడు ప్రజల కు బాటులో ఉండాలని కోరారు విధుల్లో నిర్లక్ష్యం చేసిన రోగుల పట్ల ఆలక్ష్యంగా వ్యవహరించిన సహించేది లేదని హెచ్చరింపులు. ఆసుపత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచన చేశారు ఇదే సందర్భంలో లైన్స్ క్లబ్ వారు అందిస్తున్న సేవలను కూడా గుర్తించారు ప్రజలకు సామాజిక సేవలు చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి మీరు ఎందుకు చేయలేని ఒక సందర్భంలో ప్రశ్నించారు డయాలసిస్ సమస్య ఉన్న రోగులు అధికం ఉండడంతో అది ఆసుపత్రి పైభాగంలో ఉండటం రోగులకు బంధువులకు ఇబ్బందిగా ఉందని దానిని వెంటనే కింద ఫ్లోర్లోకి మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నాలుగు డయాలసిస్ మిషన్లు వస్తున్నాయని వివరించారు అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచనలు చేశారు .ఒక వైద్యంతో పాటు కాకుండా పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ గ్రామాల్లో రహదారు పరిశుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా వాళ్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు గ్రామ స్థాయిలలో, శివారు గ్రామ స్థాయిలలో నిత్యం పర్యటిస్తూ ప్రజా సమస్యలను అక్కడి నుంచి సంబంధిత అధికారులకు ఫోన్లో విషయం తెలియజేస్తూ కావాల్సిన చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశాలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ పరంగా డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ధరణిలో సమస్యలు లేకుండా చూడాలని సూచనలు చేస్తున్నారు అంతేకాకుండా గ్రామాల్లో భూ సమస్యలు అధికంగా ఉంటాయని ఆ సమస్యను ఒప్పందం కాకుండా రెవెన్యూ అధికారులు ప్రజల నుంచి రైతుల నుంచి విజ్ఞప్తులు వచ్చే వెంటనే పరిష్కరించాలని తగు జాగ్రత్తలు సూచనలు తెలియజేస్తున్నారు. ఇటీవల మూడించల విధానంలో కలిగిన జడ్పిటిసి ,ఎంపిటిసి ప్రజాప్రతినిధులు పదవీకాలంతో ముగియడంతోవారికి సన్మానాలు వారు చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు వారు ఇంకా చేయాల్సిన సేవలు గురించి వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు.నియోజకవర్గానికి కేంద్ర బిందువైన మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు సంబంధిత మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్, శానిటరీ టౌన్ ప్లానింగ్ , ప్రజారోగ్యం, వాటర్ సప్లై ఇతర శాఖల అధికారులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు లేకుండా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ గెలిచిన వార్డులలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి వీరు వచ్చాక ఆయా వార్డుల్లో రహదారులు, డ్రైనేజీలు నిర్మాణం వంటి పనులు ప్రారంభం అయ్యాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీలు, వ్యక్తుల తీతంగా నిరంతరం అందుబాటులో ఉంటూ వస్తున్న ఎమ్మెల్యే పాలన దక్షిత ప్రజలకు తెలియాలంటే స్థానికంగా ఉన్న జర్నలిస్టులు, రిపోర్టర్స్ ఎలక్ట్రాన్ మీడియా వారితో కూడా మంచిగా ఉంటా వారు సూచించిన పలు సమస్యలను అధికారుల ద్వారా చర్చించి పరిష్కరిస్తూ వస్తున్నారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ వారు చెప్పిన ఈ చిన్న సమస్యనైనా స్పందిస్తూ పరిష్కరిస్తున్నారు అదేవిధంగా విద్యాశాఖ పై పట్టు కూడా సాధించారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మిర్యాల నియోజకవర్గంలో విజయవంతం చేశారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం నాయకులతో సంప్రదింపులు వ్యూహాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో బడి పిల్లలు చేరే విధంగా వారిని ప్రోత్సహిస్తూ వారికి సంబంధించిన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తూ ముందుకు వెళుతున్నారు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తన నెలసరి జీతాన్ని ప్రభుత్వం స్వీపర్లకు ఇస్తానని సభలో ప్రకటించారు ప్రజలు వారి సమస్యలు నేరుగా చెప్పుకోవచ్చని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైద్యశాఖ అధికారులతో గ్రామాల్లో సీజనల్ వేదనలు వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రోగాలు పెరగకుండా పలు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు కూడా చేస్తున్నారు ప్రజలు కూడా రోగాలు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు కుల సంఘాలు, ప్రజాసంఘాలు వారు సమస్యలను దృష్టి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు ప్రజలకు అర్హులకు వారికి ప్రభుత్వ పథకాలను అందాలనే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. మిర్యాలగూడలో అతిపెద్ద ప్రధాన సమస్య బైపాస్ రోడ్డు దీనిపై ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారు వాళ్ళ కుటుంబాలు వీధి పాలయ్యాయి .ఈ సమస్యను సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మిర్యాలగూడ బైపాస్ మీద నాలుగు ఫ్లైఓవర్ మంజూరు చేయించారు ఈ పనులు ప్రారంభo కానున్నాయి . అదే విధంగా దామరచర్ల మండలంలో మూడు ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వంలో మంజూరయ్యా యి .వాటికి కొంత నిధులు కొరత వలన అర్ధాంతరంగా ఆగిపోయాయి వాటికి నిధులు మంజూరు చేయాలని సంబంధిత మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి పలు విజ్ఞాపతులు చేశారు అవి కూడా త్వరలో వేగవంతం అవుతాయని చెప్పారు మారుమూల గ్రామాల్లో మిషన్ భగీరథ వాటర్ లేదు. శివారు ప్రాంతాలు కు కూడా నీటి సరఫరాకి సంబంధించిన పైప్లైన్ లో ఏర్పాటు చేయించుచున్నారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు అర్హులైన వారికి ఉద్యోగాలు అందేలా కూడా చర్యలు చేపడుతున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.