Ultimate magazine theme for WordPress.

ఆరు గ్యారెంటీ లు అనే బూచితో కాలం వెళ్లబోస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ …మిర్యాలగూడ పట్టణ భాజపా అధ్యక్షులు హనుమంత రెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…

.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అనే జెండా పట్టుకుని కాలం వెళ్లబోతుందని మిర్యాలగూడ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్మంత రెడ్డి హనుమంత రెడ్డి అన్నారు. మంగళవారం స్థానికంగా ఉన్న బృందావన్ గార్డెన్స్ లో జరిగిన పట్టణ భాజపా శాఖ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ అమలు చేస్తున్నానని ఈ ప్రభుత్వం విర్రవీగుతుందనీ విమర్శించారు.   రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల హామీలను అమలు చేయకపోతే వారిని విడిచిపెట్టే లేదని పేర్కొన్నారు . కాంగ్రెస్ చెప్పిన ఆరుగారంటీలో రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న విషయాన్ని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కానీ వారి ముఖ్యమంత్రి గానీ కాంగ్రెస్ నాయుకులు మరవరాదని సందర్భంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను తమ పథకాలు అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి వెంటనే వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కోరారు. రైతు రుణమాఫీలో కొర్రీలతో చాలా మంది రైతులు రుణమాఫీ ఎగ్గొట్టారని, రైతు భరోసా, కౌలు రైతుల సహాయము, వడ్లకు 500 బోనస్ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రజలకు బాగా ఉపయోగపడుతున్న ఆయన తెలిపారు .పథకాన్ని చిరు వర్తకులు, మహిళలు వ్యాపారస్తులు ఉపయోగించుకున్నారని . ప్రస్తుతం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మాయల మరాఠీ గా వ్యవహరిస్తుందని దుయ్యబడ్డారు . వాస్తవాలు మాట్లాడాలని ముఖ్యమంత్రి స్వప్న లోకం నుంచి బయటికి వచ్చి ప్రజాపాలనకు నడుము బిగించాలని ఈ సందర్భంగా కోరారు. మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ సాధినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో బిజెపికి ఓటు బ్యాంకు బాగా పెరిగిందని రాను నా రోజుల్లో తెలంగాణలో భాజపా ప్రభుత్వ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ పట్టణ అధ్యక్షుడు రేపాల పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యంగా పోరాడి భవిష్యత్ కాలంలో స్థానిక మున్సిపాలిటీలో బాజాపా జెండా ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి ,సరిత, శేఖర్, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిల్లంచర్ల పాండు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.