Ultimate magazine theme for WordPress.

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సెప్టెంబర్ 17 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Post top

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం.. పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్..
తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 18న ఆవిష్కృతమైంది.. తెలంగాణ అంటే త్యాగం.. దొడ్డి కొమరయ్య లాంటి మంది వీరులు ఎందరో త్యాగం చేశారు.. సెప్టెంబర్ 17 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. కానీ మేము ప్రజా పాలన చేయాలని మేము నిర్ణయించాం.. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది.. ఓ నిజాము పిశాచమా అన్న దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం, రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు.. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు.. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు.. ఇది తెలంగాణ ప్రజల విజయం.. ఇందులో రాజకీయాలకు తావులేదు.. సెప్టెంబర్ 17ను కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరానిది- సీఎం రేవంత్
ఢిల్లీకి పోతే కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు.. ఢిల్లీ పాకిస్థాన్ లో ఉందా..? వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీ వెళ్ళడం లేదు.. రాష్ట్ర హక్కుల కోసం.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతాం.. లేక్ సిటీ కాస్త.. డ్రగ్స్ సిటిగా మార్చేశారు.. చెరువుల రక్షణకు హైడ్రాను తీసుకొచ్చాం.. ప్రకృతి విపత్తు రాకుండా చూడాలి.. హైడ్రా వెనకాల రాజకీయం లేదు.. కొందరు హైడ్రానీ నీరుకార్చే పనిలో ఉన్నారు.. ఎవరు అడ్డుకున్నా ఆగదు హైడ్రా.. ప్రజలు సహకరించాలి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

post bottom

Leave A Reply

Your email address will not be published.