Ultimate magazine theme for WordPress.

రాజకీయ చదరంగం క్రీడలో ప్రారంభానికి నోచుకోని కళాభారతి కేంద్రం

Post top
home side top

రాజకీయ చదరంగంలో…. ప్రారంభం కోసం చూస్తున్న కెసిఆర్ కళా కేంద్రం….. మిర్యాలగూడ పట్టణంలో కోట్ల రూపాయలతో నిర్మించిన కెసిఆర్ కళాభారతి ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాదాపు 15 సంవత్సరాలు పైన ఈ భవన నిర్మాణం కొనసాగుతూ వస్తూనే ఉన్నది. ఇప్పటికి ఇంకా లోటుపాట్లు ఉన్నాయి .ఈ భవనo ప్రారంభం పరిశీలిస్తే రాజకీయ ఆటలో అరటిపండు లాగా నిలబడిపోయింది. పెద్ద పట్టణంలో కళాభారతి గాని సాహితీ వేదిక గాని ప్రారంభం నోచుకోకపోవడం ఇప్పుడున్న నాయకులు, పాత తరం నాయకులు సిగ్గుపడాలి. ఈ భవనం ప్రారంభానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారో వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ భవనం పూర్తయి కలెక్టర్కు స్థానిక మున్సిపల్ కార్యాలయానికి అప్పగించినప్పటికీ నేటికీ ప్రారంభం కావడం లేదు. గతంలో ఒకమారు ఇందులో నాటక కళాపరిషత్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. అంతే అనంతరం మరల తాళం.. ఆ తాళం నేటికి తెరుచుకోలేదు. దీనికి అందరూ ఏదో కుంటి సాకులు చెబుతున్నారు .ఒక ఆయన బిల్లులు రాలేదని అంటారు. మున్సిపాలిటీ అధికారులు భవనం ను మాకు అప్పగించలేదని, కలెక్టర్ నాటక ప్రదర్శనలకు కళా భారతీని ఇవ్వాలని ఆర్డర్స్ ఇస్తారు. ఇదంతా ఒక రాజకీయ చదరంగం ఆటలాగానే ఉన్నది. ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు నాయకులు సంఘాల్లో గౌరవప్రదమైన వ్యక్తులందరూ దీని గురించి కొంత ఆలోచించి ఈ భవనాన్ని ప్రారంభించినట్లయితే మనము మన ప్రాంత ప్రజలు ప్రజా సదస్సులు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. రాజకీయ క్రీడా అనుకుంటే ఇందులో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ లో కాలగర్భంలో కలిసి మరల నిధులు కేటాయించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అందరూ నడుం బిగించాలి. ఎవరు శేషభిశలకు వెళ్ళవద్దు. స్థానికంగా ఉన్న మిర్యాలగూడ సాంస్కృతిక నాటక పరిషత్ వారు ఈ భవన ప్రారంభం కోసము పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఒక్కడు ముందు పడటం లేదు ఇందులో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని భవనాన్ని ప్రజా అవసరాలకు, వేదికల అవసరాలకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వీటిని పరిశీలిస్తే ఈ భవనానికి పెట్టిన నామకరణ వెనుక నే రాజకీయ ఉన్నట్లు సు స్పష్టం.. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ భవనాన్ని విని వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

post bottom

Leave A Reply

Your email address will not be published.