Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడలో అధికార -ప్రతిపక్షాల మధ్యన మాటల మతాబులు

Post top
home side top

ఎమ్మెల్యే -మాజీ ఎమ్మెల్యేల మధ్యన పెరుగుతున్న మాటల బాంబులు…
మిర్యాలగూడ ప్రజాలహరి..
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి- మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ల మధ్యన మాటల యుద్ధం పరంపర ప్రారంభమైంది .చివరికి ఇది కార్యకర్తల మధ్యన ఘర్షణ దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరువురు అభివృద్ధిపై తమ ఆక్రోషం ను బహిరంగంగా, నాయకుల మధ్య సభలలో వెలగక్కుతున్నారు .ఇది ఒక్కో సందర్భంలో మంచి ఫలితాలు ఇస్తాయి. చెడు ఫలితాలు ఇస్తాయి. అభివృద్ధి అనేది మిర్యాలగూడకు అవసరం. దానికోసం అధికారం ఉన్నవారు, లేనివారు కృషి చేయడం అభినందనీయమే. కానీ అదే సందర్భంలో మాటలు మతాబుల్లాగా పేలటం వలన ప్రశాంతంగా ఉన్న మిర్యాలగూడ సమస్యాత్మక ప్రాంతంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు పార్టీలకు గ్రామాల్లో పట్టు ఉన్నాయి. ఇరువురు ఈ విధమైన వ్యాఖ్యల వల్ల స్థానికంగా ఉన్న కార్యకర్తలు నాయకులు ఆవేశాలకు లోని గ్రామాల్లో హింసాత్మక ఘటనకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాయకులు అధికార పార్టీ వారు కావచ్చు, ప్రతిపక్షం వారు కావచ్చు ఇరువురు ఈ విధానాలను మానుకోవాలి … ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది అంటే నిన్నటి నాలుగు ఫ్లై ఓవర్ల బ్రిడ్జిల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ఏనాడు కూడా అంత ఆగ్రహంగా ఆవేశంగా మాట్లాడలేదు. పరోక్షంగా విపక్ష నేతలు పై గట్టిగా మాట్లాడారు. దీనివల్ల భవిష్యత్తులో కార్యకర్తల మధ్యన ప్రజల మధ్యన అంతరాలు ఏర్పడి కక్షల వైపు దారి తీసే అవకాశం ఉంది. కావున రెండు పార్టీలకు చెందిన నాయకులు అభివృద్ధి విషయంపై ఫోకస్ చేయాలి. ఇరు పార్టీలో చేయాల్సిన నాలుగైదు అభివృద్ధి పనులు ఉన్నాయి. మిర్యాలగూడ మంచి వ్యాపార కేంద్రంగా మార్చాలి. ఒకటి మిర్యాలగూడ నాలుగు వైపుల వ్యాప్తి చెందేలాగా కొన్ని వ్యాపార సంస్థలను పట్టణానికి నాలుగు ముఖాల వైపు తీసుకువెళ్లాలి. ఒకటి ఆటోనగర్ ఇంతవరకు ప్రస్తావనే లేదు. దానికి ల్యాండ్ కేటాయింపు రహదారణ నిర్మాణం జరిగింది . దీనిపై ఇరువురు నేతలు స్పందించటం లేదు. మిర్యాలగూడ కూరగాయల మార్కెట్ ఇరుకుగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది. దీన్ని పాత వ్యవసాయ మార్కెట్లోకి షిఫ్ట్ చేయాలనే ఆలోచన ప్రజల్లో ఉన్నది .ఆ విషయం మీద దృష్టి పెట్టడం లేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూతబడి ఏళ్ళు అవుతున్నది దాన్ని తెరిపిద్దాం అని ఆలోచన లేదు మరొకటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ మిర్యాలగూడ మంజూరై కొన్ని ఏళ్ల పాటు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడి మూతపడి ఆ స్థలాలు వ్యవసాయ మార్కెట్, కళాశాలలకు ఇవ్వడం జరిగింది .కానీ అటువంటి మళ్లీ నిజాం షుగర్స్ గాని ఇతరత్రా కొత్త ప్రాజెక్టు తీసుక రావాలన ఆలోచన మాత్రం ఎవరూ చేయట్లేదు.. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే మిర్యాలగూడ ఇప్పటికి కొన్ని రైళ్లు ఆగకుండా వెళ్ళిపోతుంటాయి. మిర్యాలగూడ రైల్వే ప్రయాణికుల కోసం ఒక కమిటీ వేయడం అన్ని రైలు ఆగేటట్టు చేయటం గాని అటువంటి ప్రయత్నాలు మాత్రం ఎవరూ చేయట్లేదు ఇది కడు శోచనీయం. ఇరు పార్టీల నాయకులు సామరస్యంగా శాంతియుత మార్గంలో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకొని అందులో సలహాలు సూచనలు తీసుకుంటూ భేషజాలకు పోకుండా అభివృద్ధి వైపు ప్రయాణించే ప్రయత్నం చేయాలి. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఇప్పటివరకు పనిచేసిన ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కరరావు, ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎవరికి వారు తమ వంతుగా మిర్యాలగూడ అభివృద్ధికి కృషి చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు వారు అలా పని చేయడం వలన మిర్యాలగూడ ఈ మాత్రం ఈ స్థాయిలో ఉండగలిగింది. కానీ మిర్యాలగూడ ఇప్పుడున్న జనాభాకు ఈ అభివృద్ధి సరిపోదు ఇంకా చేయాలి అందుకు కావాల్సిన ప్రణాళికలు తయారుచేసి అభివృద్ధికి సమిష్టిగా అందరూ కృషి చేయాలి.

post bottom

Leave A Reply

Your email address will not be published.