Ultimate magazine theme for WordPress.

ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం జూలకంటి రంగారెడ్డి

Post top
home side top

ప్రజల పాలనలో ప్రజా సమస్యలు పట్టవా….?
* విష జ్వరాల నుండి ప్రజలను కాపాడాలి
* రైతు భరోసాను వెంటనే అమలు చేయాలి
* అర్హులైన వారందరికీ రుణ మాఫీ చేసి ఇళ్లస్థలాలు ఇవ్వాలి
* విలేకరుల సమావేశంలో జూలకంటి

ప్రజాలహరి మిర్యాలగూడ

రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుందని గొప్పలు చెప్పుకునే ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోరా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని పారిశుధ్యం లోపించి విష జ్వరాలు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాల సోకి అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాల నుండి ప్రజలను కాపాడాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య దోపిడిని అరికట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో మొబైల్ వైద్య బృందాలను పంపించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో సురక్షితమైన మంచినీరు అందించాలని, పంటలు ఎండిపోకుండా సాగునీరు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసే విధంగా కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే విధంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలు అమలు అయితే కార్మికుల హక్కులు హరించిపోతాయని పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతన చట్టం అమలు అయ్యే విధంగా చూడాలని కోరారు. రాష్ట్రంలో ఇంకా 30 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కొనసాగుతుందని రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ అప్పులను ఆశ్రయిస్తున్నారని, వెంటనే రైతుబంధు ఆర్థిక సాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు వృధాగా ఉన్నాయని వాటిని లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. మిర్యాలగూడ నల్గొండ ప్రాంతాలలో అంతర్గత డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని, దాని ఫలితంగా మురుగునీరు రోడ్లపై చేరి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని తక్షణమే డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అరులైన వారందరికీ, జర్నలిస్టులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, వరలక్ష్మి, ఎండి అంజాద్,లక్ష్మీనారాయణ, దయానంద తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.