Ultimate magazine theme for WordPress.

నకిలి అధికారులు ఆరేస్ట్

Post top
home side top

*నకిలీ బ్యాంక్ అధికారులుగా చెలామణి అవుతూ,రైతులను మోసం చేస్తున్న నిందితుల అరెస్టు*

నకిలీ బ్యాంక్ అధికారులుగా చెలామణి అవుతూ,రైతులను మరియు వ్యాపారస్తులను మభ్యపెడుతూ తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇప్పిస్తాము అని మోసం చేస్తున్న నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసు..
-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్.
 మొత్తం 7 మండలాలకు చెందిన 28 మంది రైతులను మోసం.
 అమాయక రైతుల వద్ద నుండి దాదాపు 26 లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితులు.
 ఏడుగురు నిందితులు అరెస్టు

నిందితుల వివరాలు:-
1. కట్టేబోయిన పరమేష్ S/o లింగయ్య, వయస్సు: 42 సం లు, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయము, R/O వెలుగూడెం గ్రామము, పెద్దవూర మండలము (రైతుల దగ్గరకి వెళ్ళి రుణాలు ఇప్పిస్తానని చెప్పే వ్యక్తి).
2. మమ్ముల జ్యోతి స్వరూప్ @ మణి @ రాజేష్ s/o రాజ శేఖర్, వయస్సు: 34 సం లు, కులము: తెలగ, వృత్తి: వ్యవసాయము & MRF టైర్స్ రిబటన్ బిజినెస్, N/o జంకుతండా H/o వెంకటాద్రిపాలెం గ్రామము, మిర్యాలగూడ మండలము, R/o తులనమ్మ హెూటల్, సూర్యపేట టౌన్ (నకిలీ బ్యాంక్ అధికారిగా నటించిన వ్యక్తి.
3. షేక్ వజీర్ s/o మాధార్, వయస్సు: 40 సంలు, కులం: ముస్లిం, వృత్తి: వ్యవసాయము, R/o AP లింగోటం గ్రామము, నార్కెట్ పల్లి మండలము (రైతుల ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి డాక్యుమెంటరీ తయారు చేసే వ్యక్తి). (పరారీలో)
4. కొండా శ్రీను @ శ్రీనివాస్ s/o చంద్రయ్య, వయస్సు: 40 సం లు, కులం: మాదిగ, వృత్తి: వ్యవసాయము, R/o చిరుమర్తి గ్రామము, మాడ్గులపల్లి మండలము (నకిలీ బ్యాంక్ అధికారిగా నటించిన వ్యక్తి).
5. గోగుల సురేశ్ @ రమేశ్ S/o లింగయ్య, వయస్సు: 28 సంలు, కులం: వడ్డెర, వృత్తి కార్ డ్రైవరు, R/o గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ బాక్ సైడ్ (బాపూజీ నగర్, మిర్యాలగూడ) (నకిలీ బ్యాంక్ అధికారిగా నటించిన వ్యక్తి).
6. చిలుముల సైదులు 5/0 సత్యం, వయస్సు: 35 సం లు, కులం మాదిగ, వృత్తి: వ్యవసాయము, R/o జప్తివీరప్ప గూడెం గ్రామము, మిర్యాలగూడెం మండలము (నకిలీ బ్యాంక్ అధికారిగా నటించిన వ్యక్తి).
7. పల్లెబోయిన నాగరాజు @ నాగార్జున S/o చిన రామలింగయ్య, వయస్సు: 32 సం లు, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయము. R/o తెప్పలమడుగు గ్రామము, పెద్దవూర మండలము (ఏ-1 పరమేష్ కి బందువు మరియు పరమేష్ తో పాటు రైతుల దగ్గరకి రుణాలు ఇప్పించుట కొరకు వెళ్ళే వ్యక్తి).
8. ముప్పిడి సైదులు s/o లింగయ్య, వయస్సు: 35 సం లు, కులం: మాదిగ, వృత్తి: ఫ్లవర్ డెకోరేషన్, R/o అంబేత్కర్ కాలనీ, నార్కెట్ పల్లి గ్రామము & మండలము (రైతుల ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి డాక్యుమెంటరీ తయారు చేసే వ్యక్తి)
కేసు వివరాలు.
జిల్లాలో గత కొంత కాలంగా పైన తెలిపిన నిందితులు నకిలీ బ్యాంక్ అధికారులుగా చెలామణి అవుతూ రైతులకు వద్దకు వెళ్లి వారి యొక్క భూములను తనఖాగా పెట్టుకొని తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్ నుండి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని, వివిధ బ్యాంక్లలో పనిచేస్తున్న అధికారులుగా నటిస్తూ నల్గొండ జిల్లాలోని పెద్దవూర, తిరుమలగిరి (ఎస్), నిడమానూర్, నేరేడుగొమ్ము, దేవరకొండ మరియు పిఏ పల్లి మండలాలలోని అమాయక రైతుల నుండి రుణాలు ఇవ్వుటకు ముందుగా రైతుల వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకొని మరియు హాలియా మండలంలోని ఒక వ్యాపారికి సోషల్ వెల్ఫర్ నుండి ఆదిక మొత్తంలో లోన్ ఇప్పిస్తామని నమ్మించి ఇప్పించకుండా ఒక ముఠాగా ఏర్పడి మోసము చేస్తున్న నిందితులను పెద్దవూర పోలీసు వారు పట్టుకొని వారి నుండి ప్రస్తుతానికి ఒక లక్షా అరవై అయిదు వేల రూపాయలు మరియు రైతుల నుండి వారు తీసుకున్న పట్టాదారు పాసుపుస్తకాలు మరియు Agreement డాక్యుమెంట్స్ ను స్వాధీనము చేసుకొని నిందితులను రిమాండ్ కి తరలించారు.
పైన తెలిపిన మండలాలలో నిందితులు రైతుల వద్ద నుండి మరియు వ్యాపారస్తుల నుండి వసూలు చేసిన మొత్తం 25 లక్షల 7 వేల రూపాయలు. ఈ మొత్తం నగదుని కోర్ట్ అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకొని రికవరీ చేసామని తెలిపారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.