Ultimate magazine theme for WordPress.

కల్లేపల్లి బంగారు మైసమ్మ వద్ద సౌకర్యాలు మెరుగుపరచాలి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి; దామరచర్ల మండలం గ్రామం కల్లేపల్లి లో గల బంగారు మైసమ్మ తల్లి దేవస్థానంలో పరిశుభ్రత మరియు మౌలిక వసతుల మెరుగుపరచాలని. తెలంగాణ గిరిజన విద్యార్థి సమైక్య ప్రధాన కార్యదర్శి గీరావత్ లింగ నాయక్ జిల్లా కలెక్టర్ ను కోరారు
శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం కల్లేపల్లి గ్రామం మండలం దామరచర్ల మిర్యాలగూడ పరిధిలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవస్థానం ఉన్నది వారంలో గురువారం ఆదివారంలో వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు. భక్తులకు వసతులు పరిశుభ్రత, మౌలిక వసతులు సరిగా లేక దుర్వాసన వస్తున్నది. చినుకు పడితే భక్తులకు రోడ్డుమీద మురికి కాలువ మరియు బురద నిండి నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. స్నానం చేయడానికి టాయిలెట్స్ వాడడానికి బాత్రూములు లేక మంచినీరు లేక బాత్రూంలో మొత్తం రిపేర్లు ఉండి సరి అయిన వసతులు లేక రోడ్లమీద బురదతో నానా తిప్పలు పడుతున్నారు. మరియు రోడ్లు వెడల్పు లేక ట్రాఫిక్ ఉండడం వల్ల రోడ్డు వెంట వచ్చే భక్తులకు రెండు రోడ్లు పక్కన లైట్లు లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా లైట్లు లేకపోవడంతో ఆ ఊరి జనం బహిర్భూమికి వెళ్ళడం వల్ల గుడికి అర కిలోమీటర్ దూరం వరకు దుర్వాసన వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. వారానికి రెండు నుండి మూడు లక్షలు హుండీ ద్వారా దర్శనం ద్వారా యాటలు, దున్నలు, కోళ్ల టికెట్ల ద్వారా వస్తున్నాయి. కొబ్బరికాయ పాటలు, లడ్డు పాటలలో మరియు ఇతర పాటల ద్వారా నెలకు 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఆదాయం ఉన్నది. గిరిజన దేవత అని ఆలయ ఈవో ఆఫీసర్ సరియైన వసతులు కల్పించడం లేదు. వచ్చిన భక్తులుగిరిజన దేవత వరాలు జల్లే దేవత అని చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ లంబాడి గుడి అని పరిశుభ్రత లేదని ఎగతాళి చేయడం జరుగుతున్నది. 12వ తేదీ 13వ తేదీన వెయ్యి మంది భక్తులు దర్శనం నానికి వచ్చారు. చినుకు పడగానే బురదతో నిండి అక్కడ ఎవరికీ తెలియజేయాలన్నా ఆఫీసులో ఆఫీసర్లు ఉండడం లేరు. దేవాలయాన్ని మాత్రం గ్రేట్ వన్ గా చేసి ఈవో గారు ఇన్చార్జి గారు సరిగా పట్టించుకోవడం లేదు. వారానికి ఒకసారి వచ్చి హుండీ లెక్కలు చూసుకుని వెళ్లిపోవుచున్నారు. పండగ సందర్భంగా ఎప్పుడు లెక్క చెప్పకపోయినా గిరిజన దేవత అయిన కూడా అక్కడ ఉన్న గిరిజనులకు అందులో ఒక్క జాబు కూడా ఇవ్వడం లేదు. గుడి చుట్టూ లైట్లు లేక రాత్రి వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ దున్నపోతులకు దొడ్డిలో బురద వల్ల అక్కడ వాసన వచ్చి అనేక భక్తులు విష జ్వరాలతో పడిపోవడం మేకలు, కోళ్లు కోసిన దగ్గర, కొబ్బరికాయలు కొట్టే దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడం వలన గుడి లింగంలో శుభ్రత లేకపోవడం వల్ల భక్తులు అనేక సమస్యలతో రోగాల బారిన పడుతున్నారు. దర్శనానికై వచ్చిన భక్తుల యొక్క వాహనాలకు పార్కింగ్ లేక గొడవలు జరుగుతున్నాయి. కావున తమరు ఇప్పటికైనా దయతలిచి మా యొక్క గుడియందు చొరవచూపి పరిశుభ్రంగా ఉంచి భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయగలరని ప్రార్థన.

post bottom

Leave A Reply

Your email address will not be published.