Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణన్

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డ్ నందు నూతన *ధాన్యం కొనుగోలు కేంద్రంను శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , సబ్ కలెక్టర్ అమిత్ నారాయణన్ లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా MLA లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
*ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అని అన్నారు*..
ధాన్యం కొనుగోలు విషయంలో ఎవ్వరూ కూడా అస్యత ప్రచారాలు నమ్మవద్దు.. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు..

అలాగే నిబంధనలు ప్రకారం ధాన్యం తీసుకువచ్చి ప్రతీ రైతు మద్దతు ధర పొందవచ్చు అని అన్నారు ..

*అలాగే సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తాం … ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయుచర్ ధాన్యానికి 2320 RSధర తో కలిపి 500 రూపాయల బోనస్ కలిపి 2830 RS ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు* కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుంది అని అన్నారు..

*రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదు అని ప్రతిఒక్క రైతుకు తెలియజేస్తున్నామని అన్నారు*… .

అనంతరం జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ .. ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశాం..
ధాన్యం కొనుగులు పై సీఎం, మంత్రులు నిత్యం సమీక్ష చేస్తున్నారు..
చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు..
జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం 156 కేంద్రాలను ఏర్పాటు చేశాం..
అవసరం అనుకుంటే మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.